BDK: అశ్వాపురం మండలంలో ప్రజల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేసిన యూడీసీ పద్మావతి బదిలీ కావడంతో పలువురు ప్రజలు, ప్రజాప్రతినిధులు భావోద్వేగానికి గురయ్యారు. కార్యాలయానికి వచ్చే ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మెలిగి, సమస్యల పరిష్కారంలో సహకరించిన ఆమె సేవలను కొనియాడుతున్నారు. ఆమె ఎక్కడ పనిచేసినా మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.