MDK: మెదక్ మున్సిపల్ కార్యాలయంలో జనగణన డైరెక్టర్ భారతి హొళ్లికేరీ, కలెక్టర్ ప్రతిమా సింగ్ సమీక్ష నిర్వహించారు. జనగణన-2027ను సిబ్బంది బాధ్యతాయుతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. తొలిసారి డిజిటల్ విధానంలో జరుగుతున్న ఈ ప్రక్రియలో మే 11 నుండి ఇండ్ల గణన ప్రారంభమవుతుందని తెలిపారు. ఏప్రిల్ 26న స్వీయ గణన చేసుకోవాలని పిలుపునిచ్చారు.