KNR: శంకరపట్నం మండల కేంద్రంలోని కేశవపట్నం రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ అర్హులైన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి పథకం కింద రూ.91,10,556 విలువైన 91 చెక్కులు పంపిణీ చేశారు. రూ.28,21,000 విలువైన 102 సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ఆర్థిక భరోసాని కల్పిస్తున్నాయన్నారు.