SRPT: హుజూర్నగర్లో గత కొన్ని రోజులుగా తరచూ విద్యుత్ అంతరాయాలు చోటుచేసుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కరెంట్ నిలిచిపోవడంతో చిన్నపిల్లలు, వృద్ధులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.