ASF: వాంకిడి మండలం నార్లపూర్ గ్రామంలో జరిగిన పోచమ్మ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన విందు భోజనం తిన్న 10 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్పందించిన తల్లిదండ్రులు విద్యార్థులను వాంకిడి ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. భోజనంలో బల్లి పడటమే దీనికి కారణమని భావిస్తున్నారు.