HNK: ఆర్టిజన్ ఉద్యోగులకు ప్రభుత్వం న్యాయం చేయాలని BRS రాష్ట్ర నాయకులు, కంటెస్టెడ్ ఎమ్మెల్సీ ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. హనుమకొండలో నిర్వహించిన బైక్ ర్యాలీలో రాకేష్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ… విద్యుత్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం, గౌరవం ఇవ్వాలని, విద్యుత్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.