MLG: జిల్లాలో ఇవాళ గ్రామ సభలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు ఎక్కువగా పాల్గొనేలా చూడాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి వివరాలను వివరించాలని చెప్పారు. అర్జీల కోసం హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సభలకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు.