వరంగల్లోని మామునూర్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఏప్రిల్ మొదటి వారంలో శంకుస్థాపన జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పర్యటనలో PM మోదీ మామునూర్ విమానాశ్రయంతో పాటు కాజీపేట అయోధ్యపురంలోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గీసుగొండ మెగా టెక్స్టైల్ పార్కులను ప్రధాని ప్రారంభిస్తారని సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.