మంచిర్యాల జిల్లా BRS భవన్లో కార్యకర్తల సమావేశంలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో సింగరేణిలో అవినీతి రాజ్యమేలుతోందని, కాంగ్రెస్ ప్రభుత్వం మెడికల్ బోర్డు నిర్వహించకుండా కార్మికుల కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. వెంటనే మెడికల్ బోర్డు నిర్వహించాలని, లేనిపక్షంలో సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు.