KNR: క్రీడల్లో గెలుపోటములను సమానంగా తీసుకోవాలని చొప్పదండి ఎస్సై నరేష్ రెడ్డి అన్నారు. రేవెల్లి గ్రామంలో ఆదివారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను ఎస్సై నరేష్ రెడ్డి హాజరై ప్రారంభించారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకొని క్రీడల్లో రాణించాలని కోరారు.