TG: మహిళా బిల్లును అడ్డుకుంటే చరిత్ర హీనులవుతారని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. పార్లమెంట్లో బిల్లుకు అన్ని పార్టీలు మద్దతివ్వాలని కోరారు. ‘బిల్లును వ్యతిరేకించే పార్టీలకు మహిళలు గుణపాఠం చెబుతారు. పార్లమెంటులో మహిళా ప్రాతినిధ్యం పెరగాల్సిందే. డీలిమిటేషన్తో పార్లమెంటులో స్థానాలు పెరుగుతాయి. తెలంగాణ అసెంబ్లీలో 60 మంది మహిళలకు అవకాశాలు వస్తాయి’ అని తెలిపారు.