GDWL: పేదరికం చదువుకు అడ్డుకాదని గద్వాల మండలం బింగిదొడ్డికి చెందిన ఉప్పరి సాయి చరణ్ నిరూపించాడు. వృత్తిరీత్యా డ్రైవర్ అయిన వీరేశ్ కుమారుడు సాయి చరణ్.. ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో 470కి 467 మార్కులు సాధించి అదరగొట్టాడు. సామాన్య కుటుంబం నుంచి వచ్చి అసాధారణ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని, అతడి తల్లిదండ్రులను గ్రామస్థులు ఘనంగా అభినందించారు.