SRCL: వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లును ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇవాళ ప్రారంభించారు. లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారికి నూతన వస్త్రాలు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు గృహ స్వప్నాన్ని నెరవేర్చే లక్ష్యంతో చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా అనేక కుటుంబాలు సొంతింటి సంతోషాన్ని పొందుతున్నాయన్నారు.