TG: తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ లాయర్ సుబ్బుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు చేసింది. ఇటీవల సుబ్బు తన కార్యాలయం వద్దకు వచ్చి రూ.10 లక్షలు డిమాండ్ చేశారని, ఇవ్వనందుకు మీడియాలో దుష్ప్రచారం చేస్తానని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొంది. మైక్రోఫైనాన్స్ పేరుతో మంగ్లీ రూ.10 కోట్లు మోసం చేశారని అడ్వకేట్ సుబ్బారావు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.