ADB: శనగ పంటను కొనుగోలు చేయాలని కోరుతూ జైనథ్ మండల కేంద్రంలో రైతులు జాతీయ రహదారిపై మంగళవారం ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పంటలను సరైన సమయంలో కొనక పోవడంతో అకాల వర్షాలకు పంట నష్టం జరుగుతుందన్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ చూపి సమస్యను పరిష్కరించాలని కోరారు.