SRPT: ఎస్సీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే ‘ఎస్సీ యాక్షన్ ప్లాన్’ దరఖాస్తు గడువును ఏప్రిల్ 8 వరకు పొడిగించినట్లు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఈరోజు తెలిపారు. ఈవీ వాహనాలు, పాడి గేదెలు, సోలార్ పంప్సెట్లపై భారీ సబ్సిడీలు ఉన్నాయని, అర్హులు OBMMS పోర్టల్లో వెంటనే నమోదు చేసుకోవాలని కోరారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.