JBL: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ధాన్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. జిల్లా పౌర సరఫరాల అధికారి కిరణ్ కుమార్ కాళేశ్వరం వద్ద అంతరాష్ట్ర చెక్ పోస్ట్‌ను బుధవారం ప్రారంభించారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ శాఖల సమన్వయంతో 24 గంటల పహారా నిర్వహిస్తామని తెలిపారు.