NLG: జిల్లాలో మిర్చి సాగు భారీగా తగ్గడంతో ధరలు పెరిగాయి. గతేడాది 12 వేల ఎకరాల్లో సాగు జరగగా, ఈసారి చీడపీడల కారణంగా కేవలం 5 వేల ఎకరాలకు పరిమితమైంది. ఖమ్మం, గుంటూరు మార్కెట్లలో తేజ రకం మిర్చి క్వింటాలకు రూ.22 వేల వరకు ఉంది. దిగుబడి తక్కువగా ఉండటంతో రైతులకు ఆశించిన లాభాలు రావడం లేదని చెబుతున్నారు.