KNR: రవాణాశాఖలో 50కి పైగా సంస్కరణలు చేపట్టామని అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు ప్రమేయం లేకుండా 37 ప్రభుత్వ ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. పాత వాహనాల స్క్రాపింగ్కు రాయితీలతో పాటు, EVలకు 100 శాతం పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు వెల్లడించారు.