E.G: అనపర్తి అండర్ గ్రౌండ్ నుంచి కొత్తూరు వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులు సోమవారం జరుగుతున్నాయి. రూ.50 లక్షల అంచనా వ్యయంతో వేగంగా సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రహదారి అధ్వానంగా ఉండడంతో గ్రామస్తుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారన్నారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చొరవకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.