VKB: మోమిన్పేట్ బస్టాండ్లో ఇవాళ విషాద ఘటన చోటుచేసుకుంది. భూర్గుపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ తన గ్రామానికి వెళ్లేందుకు బస్సు కోసం వేచి చూస్తుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురైంది. అక్కడికక్కడే కూర్చున్న చోటే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. కళ్లముందే ఈ ఘటన జరగడంతో తోటి ప్రయాణికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.