ADB: గుడిహత్నూర్ మండలం డోంగర్గావ్ సర్పంచ్ అబ్దుల్ రహేమాన్ ఖాన్ స్థానిక అంగన్వాడీ కేంద్రాన్ని శనివారం సందర్శించారు. కేంద్రంలో రికార్డులను తనిఖీ చేసిన ఆయన పిల్లలకు అందిస్తున్న పోషకాహారం, విద్యా బోధన తీరును పరిశీలించారు. గర్భిణీలు, బాలింతలకు ప్రభుత్వ సేవలు సక్రమంగా అందేలా చూడాలని, శుభ్రత పాటించాలని సిబ్బందికి సూచించారు.