GDWL: అయిజ మండలం చిన్నతాండ్రపాడు యువకుడు భరత్ కుమార్ పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు.. సోమవారం రాత్రి అందరూ నిద్రిస్తుండగా భరత్ కుమార్ పురుగుమందు తాగాడు. ఆ విషయాన్ని గుర్తించిన వెంటనే అతడిని కర్నూలు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. మంగళవారం చికిత్స పొందుతూ మృతి చెందాడని పేర్కొన్నారు.