MDK: రామాయంపేట మండలంలోని 16 గ్రామాల్లో శుక్రవారం ఉదయం 10:30 గంటలకు గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో షాజీలొద్దీన్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పంచాయతీ కార్యాలయాల వద్ద ప్రత్యేక అధికారుల సమక్షంలో ఈ సభలు జరుగుతాయి. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమన్నారు.