NLG: నార్కట్పల్లి నల్గొండ క్రాస్ రోడ్లో దుకాణాల లోకి దూసుకు వచ్చిన లారీ దుర్ఘటన స్థానిక ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. సమీపంలోని వారు ఆ భయం నుంచి ఇంకా కోలుకోలేదు. శుక్రవారం ఉదయం సంఘటన స్థలాన్ని ఎస్పీ శరత్ చంద్ర పవర్, డీఎస్పీ కొలను శివరాం రెడ్డి పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.