SRCL: రోడ్డు భద్రత అందరి బాధ్యత అని జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని రవాణా శాఖ కార్యాలయంలో సోమవారం వాహనదారులకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాణాలు అమూల్యమైనవని, ప్రమాదాల నివారణను సామాజిక బాధ్యతగా స్వీకరించాలన్నారు. మద్యం సేవించి ఎవరు వాహనాలు నడపవద్దని ఆయన కోరారు.