MNCL: పరిసరాల పరిశుభ్రత అతి ముఖ్యమైనదని జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామ ఈవో రాహుల్ కోరారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జన్నారం మండల కేంద్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలను పంచాయతీ కార్మికులతో శుభ్రం చేయించారు. అలాగే పలు కాలనీలలో ఉన్న డ్రైనేజీలలో పేరుకుపోయిన చెత్తను కూడా తొలగించారు.