NGKL: వెల్దండ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహాన్ని రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. అలాగే వంటలకు నాణ్యమైన సరుకులను వాడాలన్నారు. అనంతరం అక్కడ సైజు తక్కువగా ఉన్న గుడ్లను ఎందుకు రిటర్న్ చేయడం లేదని ఆరా తీశారు.