కోనసీమ: ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులలో సపోర్ట్ రాడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా రవాణా అధికారి డీ. శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం అమలాపురం డిపోలోని బస్సును డిపో మేనేజర్ శర్మతో కలిసి పరిశీలించారు. జిల్లా రహదారి భద్రత కమిటీ ఛైర్మన్, కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రయాణీకుల భద్రత దృష్ట్యా సపోర్ట్ రాడ్లు వేసే ప్రక్రియ చేపడుతున్నాం అన్నారు.