కాకినాడ జిల్లాలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల శివారు ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్ షాన్మోహన్ సగిలి ఆదేశించారు. గొల్లప్రోలు, పిఠాపురం పరిసరాల్లో జరుగుతున్న పనులను శుక్రవారం జేసీ అపూర్వ భరత్తో కలిసి స్వయంగా పరిశీలించారు. ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ పకడ్బందీగా పనులు చేపట్టాలని స్థానిక అధికారులకు సూచించారు.