CTR: పెద్దపంజాణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, అనారోగ్య సమస్యలతో వచ్చే ప్రజలకు అందిస్తున్న చికిత్స విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఔషధాల నిల్వలు, వైద్య సిబ్బంది హాజరు వివరాలను తనిఖీ చేశారు. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వచ్చే ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశించారు.