MHBD: రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమన్యాయం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్నదని ప్రభుత్వ విప్ డా.జాటోతు రామచంద్రనాయక్ అన్నారు. నర్సింహులపేట మండలంలో బుధవారం జరిగిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సద్వినియోగగపరుచుకోవాలని కోరారు.