ADB: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా పట్టణంలోని కేజీబీవీ పాఠశాలను సందర్శించారు. అధికారులతో కలిసి పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించిన ఆయన, విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, భవన మరమ్మతులపై సమీక్ష నిర్వహించారు. వసతులు మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు.