NZB: తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ సంస్థ ఆధ్వర్యంలో సబ్సిడీపై పాడి పశువుల యూనిట్ల దరఖాస్తుకు ఈనెల 23 గురువారం చివరి తేదీ అని ధర్పల్లి ఎంపీడీవో లక్ష్మారెడ్డి బుధవారం సూచించారు. మీసేవలో దరఖాస్తు చేసుకుని వాటి రెండు ప్రతుల జిరాక్సులను కార్యాలయంలో సమర్పించాలన్నారు. ఒక యూనిట్ విలువ రూ. 2.40 లక్షలు కాగా.. రూ..1.50 లక్షలు సబ్సిడీ, రూ. 90 వేలు బ్యాంకు రుణం ఇవ్వనున్నారు.