AP: విశాఖ గీతంలో 55 ఎకరాల భూమిని ప్రభుత్వ భూమిగా వైసీపీ గతంలో గుర్తించినట్లు మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. అధికారం అడ్డంపెట్టుకుని భూములు వాడుకుంటున్నారని ఆరోపించారు. ఏ అనుమతి ఉందని నిర్మాణాలు చేపడుతున్నారని ప్రశ్నించారు. దీనిపై పోరాటం ఆగదని, ప్రజలందరినీ ఏకం చేస్తామని అమర్నాథ్ వెల్లడించారు.