VSP: జీవీఎంసీలో కారుణ్య నియామకాల కింద 15 మందికి కమిషనర్ కేతన్ గార్గ్ ఉద్యోగ పత్రాలను అందించారు. ఈ మేరకు బుధవారం ప్రధాన కార్యాలయంలో అదనపు కమిషనర్ సత్యవేణితో కలిసి వారికి 4వ తరగతి పోస్టులు కేటాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధుల్లో నిబద్ధతతో పనిచేసి సంస్థకు మంచి పేరు తేవాలని సూచించారు.