PPM: సాలూరు మాజీ డిప్యూటీ సీఎం పిడిక రాజన్న దొర క్యాంప్ కార్యాలయంలో సర్పంచుల సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రలోభాలకు లొంగకుండా పార్టీకి అండగా నిలిచిన నాయకులను ఆయన అభినందించారు. ప్రజాప్రతినిధులు ప్రజల తలలో నాలుకలా ఉంటూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు.