ATP: యాడికి తహసీల్దార్ కార్యాలయాన్ని జాయింట్ కలెక్టర్ సీ.విష్ణు చరణ్ శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు. కార్యాలయంలోని రికార్డులను, కంప్యూటర్ విభాగాలను తనిఖీ చేశారు. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను పెండింగ్లో పెట్టకుండా సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ సేవలు సామాన్యులకు వేగంగా అందేలా చూడాలని ఆయన సూచించారు.