SDPT: అక్కన్నపేట మండలం కట్కూరుకు చెందిన కొయ్యడ సతీష్ గౌడ్ భారత ఆర్మీలో 17 ఏళ్ల పాటు సేవలందించి పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సర్పంచ్ కొడ ముంజ బాలరాజు ఆయనను ఘనంగా సన్మానించారు. దేశ సేవలో సతీష్ చూపిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొని ఆయనకు అభినందనలు తెలిపారు.