SRCL: టీం ఫంకీ జోన్ అనే పేరుతో కరీంనగర్‌కు చెందిన యువకులు పసిపిల్లల ప్రాణాలు కాపాడడానికి ఈరోజు వేములవాడలో ఫండ్స్ కలెక్ట్ చేశారు. బెల్లంపల్లికి చెందిన శివ, సహస్ర పిల్లలకు (SMA) వ్యాధి వచ్చింది. వీరి ప్రాణాలు కాపాడాలంటే రెండు ఇంజక్షన్లకు రూ.32 కోట్లు ఖర్చు అవుతుందని అన్నారు. వీరి ప్రాణాలను నిలబెట్టడానికి ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నామని, ఇప్పటికీ రూ.30 లక్షలు జమ చేశామన్నారు.