MHBD: తొర్రూరు మండలంలోని గుర్తూరు గ్రామంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా జరిగింది. గంగపుత్ర కులస్తులు డప్పు చప్పుళ్ళ నడుమ జల బిందెలు, నైవిద్యంతో కూడిన బోనాలను దేవాలయానికి తీసుకెళ్లి గంగమ్మ విగ్రహాలను శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.