WGL: వర్ధన్నపేట మండలం కొత్తపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన జల జీవన్ మిషన్ జల మహోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. జల సంరక్షణ, తాగునీటి ప్రాధాన్యతపై అవగాహన కల్పించే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామస్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు నీటిని వృథా చేయకుండా సంరక్షించుకోవాలని ప్రతిజ్ఞ చేశారు.