NGKL: అచ్చంపేటలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ కౌన్సిలర్లు మన్ను ప్రసాద్, రమేశ్ రావు ధ్వజమెత్తారు. మున్సిపాలిటీ పరిధిలో వార్డుల అభివృద్ధిని గాలికి వదిలేశారని, ప్రజా పాలన పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు తగిన బుద్ధి చెబుతారని వారు పేర్కొన్నారు.