NRPT: పాలిసెట్–2026 దరఖాస్తుల గడువు ఈనెల 22 న ముగియనుందని కోస్గి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం. శ్రీనివాసులు తెలిపారు. గడువు పొడిగింపు, లేట్ ఫీజు అవకాశం లేదని స్పష్టం చేశారు. పరీక్ష మే 13న నిర్వహించనుండగా, కొస్గి ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో ఉచిత కోచింగ్ అందిస్తున్నారు. ఇంకా దరఖాస్తు చేయని అభ్యర్థులు వెంటనే అప్లై చేయాలని ఆయన సూచించారు.