NRPT: జన గణనలో భాగంగా చేపట్టనున్న ఇండ్ల గణన ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని జనగణన తెలంగాణ రాష్ట్ర సంచాలకులు భారతి హోలికేరి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో నారాయణపేట అదనపు కలెక్టర్ ఫణీందర్ రెడ్డి పాల్గొన్నారు. మే 11 నుంచి నిర్వహించే ఇండ్ల గణన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు.