KMM: మధిర మండలం కృష్ణాపురంకు చెందిన భూక్యా జయరాం(75) వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు జయరామ్‌ను వైద్యుని వద్దకు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించాడు. వడదెబ్బతో వ్యక్తి మృతి చెందడంతో వడదెబ్బ పట్ల గ్రామంలో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. కాగా, ఇటీవల కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు, వడదెబ్బకు వృద్ధులు పిట్టల్లా రాలిపోతున్నారు.