HYD: ఖైరతాబాద్ రవాణా కార్యాలయంలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది రోడ్డుభద్రతా నియమాలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. మంత్రి మాట్లాడుతూ.. మితిమీరిన వేగం నియంత్రించడం,హెల్మెట్ ధరించడం వంటి జాగ్రత్తల ద్వారా ప్రాణనష్టాన్ని నివారించడమే ‘అరైవ్- అలైవ్’ ముఖ్య ఉద్దేశమన్నారు.