PDPL: ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి బోనాలు, పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయంలోని మదన పోచమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని సౌకర్యాలను కల్పించారు.