SDPT: బెజ్జంకి మండలం చిలాపూర్ గ్రామానికి చెందిన పువ్వాడి రాజేశ్ (30) అమెరికాలో మృతి చెందారు. అనారోగ్యంతో మంగళవారం తెల్లవారుజామున చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పదేళ్లుగా ఉద్యోగ రీత్యా అమెరికాలో స్థిరపడిన ఆయన ఆకస్మిక మృతి గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇటీవల డాక్టరేట్ పట్టా పొందినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు.