SDPT: రైతులు పంటమార్పిడి చేసుకోవాలని మంత్రి పొన్నం సూచించారు. నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఈ ప్రాంత రైతులు ఆయిల్ పామ్ సాగు చేయాలన్నారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ, రిఫైనరీ ఉపయోగించుకోవాలని, రైతులు వరి పంట నుంచి ఆయిల్ పామ్‌కు మారాలని, ఆయిల్ పామ్‌లో మూడేళ్లు అంతర్ పంటలు వేసుకోవచ్చన్నారు.